ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు పిల్లల ప్రవేశం, ఆదర్శంగా నిలిచిన గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధుల నిర్ణయానికి గ్రామస్తుల ప్రశంసలు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి సర్కారు బడిపై నమ్మకం చాటిన ప్రజాప్రతినిధులు
📍 జగిత్యాల | జూన్ 10, 2026 | బుధవారం | DNN NEWS
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీరుసాని గ్రామ సర్పంచ్ కారుకూరి శరణ్య – చంద్రశేఖర్ దంపతులు తమ ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు.
అదే విధంగా గ్రామ వార్డు సభ్యులు బర్రె లత – వెంకటేష్, గూడ నగేష్ కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి సర్కారు బడులపై విశ్వాసాన్ని చాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కారుకూరి శరణ్య మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సర్కారు బడులను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఆదరించాలని కోరారు.
సర్కారు బడులను బతికించేందుకు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీఆర్పీ పురుషోత్తం, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, వార్డు సభ్యులు, లలిత – అంజయ్య, జ్యోతి – సుధాకర్, సంధ్యారాణి – మధు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ జైషేట్టి రాకేష్
📍 ధర్మపురి టౌన్, జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
