జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదు
48 నుంచి 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
📍 జగిత్యాల | జూన్ 10, 2026 | బుధవారం | DNN NEWS
జగిత్యాల జిల్లాలో ఎక్కడా ధాన్యం కోతలు జరగలేదని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్తో కలిసి మంత్రి మాట్లాడారు.
రబీ 2025-26 సీజన్లో జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 5.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 436 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి కొందరు ప్రతిపక్ష నాయకులు కొనుగోలు కేంద్రాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ధాన్యంలో కోతలు జరుగుతున్నాయనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మంత్రి స్పష్టం చేశారు.
మిల్లర్ల వద్ద స్థల సమస్యలు తలెత్తిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించామని పేర్కొన్నారు.
మొత్తం 81,954 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, రూ.1,075 కోట్ల చెల్లింపులు విడుదల చేశామని, దాదాపు 90 శాతం రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. రైతుల ఖాతాల్లో 48 నుంచి 72 గంటల్లోనే నగదు జమ అవుతోందని వెల్లడించారు.
హమాలీల కొరత, గన్నీ బ్యాగుల కొరత వంటి సవాళ్లు ఎదురైనా జిల్లాలో రికార్డు స్థాయిలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి, 47 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయగలిగామని మంత్రి తెలిపారు.
మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి చేసిన ధాన్యం కోతల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సంబంధిత ట్రక్ షీట్ వివరాలను మీడియా ముందు ఉంచుతున్నామని చెప్పారు. 190 క్వింటాళ్ల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి చెల్లింపులు కూడా చేసినట్లు స్పష్టం చేశారు. ఎంఎం
రైతులకు అండగా ప్రభుత్వం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న దిగుబడులు మార్కెట్కు వచ్చాయని తెలిపారు. జిల్లాలో సుమారు రూ.1,100 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వరితో పాటు ఇతర పంటలను కూడా కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని, రైతులు ప్రభుత్వ కొనుగోలు విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
సైడ్ హెడ్డింగ్స్
🔹 జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు🔹 ధాన్యంలో కోతల ఆరోపణలు నిరాధారం: మంత్రి🔹 48–72 గంటల్లో రైతుల ఖాతాల్లో చెల్లింపులు🔹 రూ.1,075 కోట్లు రైతులకు విడుదల🔹 81,954 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు🔹 రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం🔹 వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో జగిత్యాల రికార్డు
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
