ఇంటర్ ఫలితాల్లో పీఆర్బీఎం కళాశాల విద్యార్థుల ప్రతిభ
రాష్ట్ర స్థాయిలో మెరిసిన విద్యార్థులు – అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్
📍 కోరుట్ల | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
ఇంటర్మీడియట్ బోర్డు గురువారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో కోరుట్ల పట్టణానికి చెందిన పీఆర్బీఎం జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో విశేష ఫలితాలు సాధించారు.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విభాగంలో టి. నేహశ్రీ 470కి గాను 468 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానం పొందగా, డి. సాయి దీప్ 467 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. అలాగే సిహెచ్. మనజ్ఞ 465, రయాన్ 463, సాహితి 462, రెహాన్ 460 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
బైపీసీ ఫస్ట్ ఇయర్ విభాగంలో జోనా ఫలక్, సిహెచ్. రినేషా, ఆర్. తేజస్వినిలు 440కి గాను 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందారు. అదేవిధంగా కే. నందిని 436 మార్కులు, సిహెచ్. అక్షర 435 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల మార్గదర్శకత్వం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ అబూబకర్ సిద్ధిఖీ
📍 కోరుట్ల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక :::
