📍 ఏలూరు | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
ఏలూరు జిల్లాలో గుర్తింపు పొందిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కె. వెట్రిసెల్వి, ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు.
జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) ఏలూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏలూరు జిల్లాలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు గుర్తింపు పొందిన జర్నలిస్టుల పిల్లలకు మానవతా దృక్పథంతో 50 శాతం ఫీజు రాయితీ అందించాలని కలెక్టర్ సూచించారు.
అలాగే ఈ ఆదేశాలను అమలు చేసేలా జిల్లా వ్యాప్తంగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (DEOs) మరియు మండల విద్యాశాఖాధికారులు (MEOs) తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు స్వాగతిస్తూ, జర్నలిస్టు కుటుంబాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
🖋️ DNN NEWS ప్రతినిధి S. Syamala
📍 ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
