📍 ఏలూరు జిల్లా | జూన్ 11, 2026 | DNN NEWS
2026-27 విద్యాసంవత్సరానికి విద్యాశాఖ సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి (శుక్రవారం) పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది.
ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు ఉండగా, ఆదివారాలు మరియు పండుగ సెలవులతో కలిపి 87 రోజుల సెలవులు ఉంటాయని వెల్లడించింది.
ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటి రోజు నుంచే బోధన, అభ్యాస కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు తదితర అంశాలపై ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండటంతో విద్యార్థులు కొత్త విద్యాసంవత్సరాన్ని ఉత్సాహంగా ఆరంభించేందుకు సిద్ధమవుతున్నారు.
🖋️ DNN NEWS ప్రతినిధి S. శ్యామల
📍 ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
