చెస్ డెవలప్మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం లోని ఇండియన్ డిజిటల్ స్కూల్లో నిర్వహించిన *జిల్లా స్థాయి అండర్-11 ఓపెన్ & గర్ల్స్ చదరంగ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి.* ఈ పోటీల ద్వారా ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 9, 10 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్-11 ఛాంపియన్షిప్లో ఏలూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం శివ గారు మాట్లాడుతూ, చెస్ మేధో వికాసానికి గొప్ప సాధనం అని పేర్కొన్నారు. చెస్ క్రీడాకారులకు అధిక ఐక్యూ స్థాయిలు ఉండి, వారు సమాజంలో ప్రత్యేక వ్యక్తులుగా ఎదుగుతారని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తున్న వారిలో చెస్ నేపథ్యం ఉన్నవారు ఎక్కువగా ఉండటం గర్వకారణమని ఆయన తెలిపారు.
పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి:
బాలుర విభాగంలో జ్యోతి స్వరూప్ మొదటి స్థానం, హరి విహాన్ రెండవ స్థానం సాధించగా, బాలికల విభాగంలో ధరణి మొదటి స్థానం, బిస్మి యాస్మిన్ జారా రెండవ స్థానం సాధించారు అని టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పాలూరి కిరణ్ కుమార్ తెలిపారు.
కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం, కోచ్ మహేష్, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి కన్నా సూర్య నాగేశ్వరరావు, స్కూల్ ప్రతినిధులు మరియు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Great achievements 👏 All the best.