అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య మార్చిన భార్య వడ్డమానులో దారుణం – 5 మంది నిందితుల అరెస్ట్
వివరాలు: నూజివీడు, మే 07 ప్రభాతవార్త: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వడ్డమాను గ్రామంలో జరిగింది. ఈ దారుణంతో జిల్లా ఉలిక్కిపడింది.
ఘటన సారాంశం: బాధితుడు: రెడ్డి సులోమన్ రాజు, వడ్డమాను గ్రామం
నిందితులు: రెడ్డి దుర్గామణి – భార్య
పలగాని వెంకన్నబాబు – ప్రియుడు, కలతోటి సాయి శ్రీనివాస్
ముద్దాలిజశ్వంత్ రాయ్, కలతోటి మడికంత
కారణం: దుర్గామణికి వెంకన్నబాబుతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలిసి ప్రశ్నించడంతో పాటు అడ్డుగా నిలుస్తున్నాడని భర్తను చంపాలని నిర్ణయించుకుంది.
పథకం: ప్రియుడు వెంకన్నబాబుతో కలిసి నాగ కిషోర్, జశ్వంత్ రాయ్, కలతోటి మడికంతలకు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. గత నెలలో సులోమన్ రాజును చంపి సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేశారు.
పోలీసుల చర్యలు:
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కెవిఎన్ ప్రసాద్ పర్యవేక్షణలో అగిరిపల్లి పోలీసులు దర్యాప్తు చేశారు. నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ, అగిరిపల్లి ఎస్ఐ కె. శివకుమార్ బృందం నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్నవి: AP 40 JS 5757 కారు, 5 సెల్ఫోన్లు, రెండు బ్యాగులు, రూ.75 వేల నగదు.
ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తోందని, టెక్నాలజీ దుర్వినియోగం కారణమవుతోందని పోలీసులు తెలిపారు.
రిపోర్టర్‌కి: కీరణ్ కుమార్ పాలూరి, న్యూస్ డెస్క్, Eluru
