మహిళలకు శక్తి కవచం.. 4 పోలీసు స్టేషన్ల పరిధిలో మహిళా పోలీసులకు కైకలూరులో అవగాహన సదస్సు.
DNN న్యూస్ డెస్క్ కైకలూరూ ఏలూరు.
ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయం.
తేది: 14.05.2026 | కైకలూరూ
జిల్లా ఎస్పీ శ్రీ కే. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ గారి పర్యవేక్షణలో, కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి. రవి కుమార్ గారి ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు కైకలూరు రూరల్, కలిదిండి, మందవల్లి, ముదినేపల్లి పోలీస్ స్టేషన్ల మహిళా సిబ్బంది హాజరయ్యారు.
సమావేశంలో ముఖ్యాంశాలు:
మహిళలు, బాలికల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ వినియోగంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్, గృహహింస నిరోధక చట్టం, 498ఏ సెక్షన్ పై అవగాహన
బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో వేధింపులపై కఠిన చర్యలు అలాగే, శక్తి టీమ్స్ సహాయం తీసుకోవాలిఅని బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి నిర్భయ సమాజ స్థాపనకు కృషి చేయాలని ఇన్స్పెక్టర్ వి. రవి కుమార్ సూచించారు.
మహిళలకు శక్తి కవచం ఆసరాగా ఉంటుందని కైకలూరులో పోక్సో నుంచి శక్తి యాప్ వరకు అవగాహన ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు – బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతామని DNN న్యూస్ డెస్క్ తెలిపారు.
DNN న్యూస్ డెస్క్ కైకలూరూ.
