తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లా లో ఈ నెల 15, 16, 17, 18 తేదీలలో నిర్వహించిన 16వ జాతీయ స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో 24కేజీల విభాగంలో కోరుట్ల పట్టణానికి చెందిన అయేషా మారియం పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రజత(వెండి)పథకం సాధించడం జరిగింది.అయేషా జాతీయస్థాయిలో పాల్గొన మొదటిసారే అత్యంత ప్రతిభ కనబరుస్తూ ఏళ్ల అనుభవ్యజ్ఞులైన ప్రత్యర్ధులతో పోరాడి ఒక్క పాయింట్ తో స్వర్ణం చేజారిన రజతం(వెండి) సాధించడం గొప్పగా ఉందని మాస్టర్ తైక్వాండో క్లబ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, నేషనల్ కోచ్, నేషనల్ రిఫరీ నావనంది రమేష్ చెప్పడం జరిగింది మాస్టర్ మాట్లాడుతూ, “మా వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు ప్రతిరోజూ కఠిన సాధన చేస్తూ తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం ఒక్కో మెట్టు ఎదుగుతూ, గతంలో కేవలం బ్రాంజ్ పతకాలకే పరిమితమైన స్థితి నుంచి ఈసారి 3 బంగారు, 2 రజత పతకాలు సాధించడం ఎంతో గర్వకారణం. ఇది మాస్టర్ తైక్వాండో క్లబ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం” అని తెలిపారు.ఈ విజయంతో అకాడమీ పేరు జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి చేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జి. సంతోష్ కుమార్, గంగారావు, ఎలుగందుల అజయ్, ఎండీ యాసిన్ తదితరులు పాల్గొని ప్లేయర్స్‌ను అభినందించారు
రిపోర్టర్ రియాజ్.
