ఆకివీడు సీఐ వేధింపులతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు – న్యాయం చేయాలని తల్లి వినతి
DNN న్యూస్ డెస్క్ | ఏలూరు
తేదీ: 18 మే 2026
ఆకివీడు సీఐ వేధింపులతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు – న్యాయం చేయాలని తల్లి వినతి
ఆకివీడు సీఐ ఖాళీచరణ్ తన కుమారుడు వీధి నవీన్ కుమార్‌ను ఈ నెల 10వ తేదీన ఆకివీడు పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పి కొట్టారని, ఆ అవమానం, నొప్పులు భరించలేక మరుసటి రోజు 11వ తేదీన తన కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి వీధి బుజ్జి ఆరోపించారు.
ఆదివారం ఏలూరులో డీఐజీని కలిసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉన్నానని, కుమారుడిపై కోడలు మరియు అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు స్టేషన్‌కు పిలిచి అక్రమంగా దాడి చేశారని ఆమె వాపోయారు.
“నా బిడ్డను బట్టలు ఊడదీసి కొట్టడం వల్లే అతను తీవ్ర మనస్తాపానికి గురై చనిపోయాడు. మాకు న్యాయం కావాలి” అని బుజ్జి కన్నీటితో కోరారు.

ఈ ఘటనపై భీమవరం డీఎస్పీని, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదని, అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఏలూరు రేంజ్ డీఐజీని కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు.

ఆర్పీఐ పార్టీ నాయకులు మతే బాబీ, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె డీఐజీకి వినతిపత్రం సమర్పించారు. సీఐ ఖాళీచరణ్పై చర్యలు తీసుకోవాలని, న్యాయ విచారణ జరిపించాలని కోరారు.
