DNN న్యూస్ చింతలపూడి, జూన్ 1:
చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు, ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ మాట్లాడుతూ, పింఛను పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో నెల రోజులలోపు భార్యకు నూతన స్పౌజ్ పింఛన్ మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులతో, ముఖ్యంగా డయాలసిస్ చికిత్స పొందుతున్న వారికి మందుల ఖర్చుల నిమిత్తం ప్రతినెల రూ.10,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ ముళ్లగిరి అచ్చయ్య, పడమటి సుబ్బారావు, నాయకులు నక్క భాస్కరరావు, బోడా సుగుణ్ కుమార్, శ్రీను, నక్క భూషణం, ఎస్సీ సెల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, సురేంద్ర, పీక నాగేంద్ర, సచివాలయ పోలీస్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
