తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం తరపున నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ మహమ్మద్ అజారుద్దీన్ ,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గారితో కలిసి పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఈ సందర్భంగా మొదటగా అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి,పోలీస్ గార్డ్స్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం జగిత్యాల పట్టణంలోని రహ్మత్పుర కు చెందిన DNN న్యూస్ రిపోర్టర్ మొహమ్మద్ రియాజ్ కుమారుడు మొహమ్మద్ అఫ్వాన్ (ఆహ్యమ్) మరియు వికేఅర్ అకాడమీ కి చెందిన యువకులు తదితరులు మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ ను కలిశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్,అదనపు కలెక్టర్ రాజా గౌడ్,లైబ్రరీ ఛైర్మెన్ దినేష్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నందయ్య,మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, కోరుట్ల మున్సిపల్ వైస్ చేర్మెన్ షహీద్, మాజీ వైస్ చేర్మెన్ సిరాజుద్దీన్ మన్సూర్, సమాజిక కార్యకర్త రియాజుద్దీన్, శ్రీనివాస్,AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

