జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
ఎంపికైన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన “సేవా పథకం”లకు ఎంపికైన జగిత్యాల జిల్లా పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు దానంతట అదే వస్తుందని తెలిపారు. ప్రజలకు చట్టపరిధిలో సేవలందించడంతో పాటు ఉన్నతమైన విలువలతో విధులు నిర్వహించడం ద్వారా ప్రజల ప్రశంసలతో పాటు ప్రభుత్వ గుర్తింపు కూడా లభిస్తుందన్నారు.
పోలీస్ శాఖలో విశేష సేవలందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక పథకాలకు ఎంపిక కావడం గర్వకారణమని, ఈ అవార్డులు ఇతర పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విధుల్లో రాణించి పొందిన పతకాలు జీవితాంతం మధురస్మృతులుగా నిలిచిపోతాయని ఎస్పీ తెలిపారు.
సేవా పథకానికి ఎంపికైన అధికారులు:
1. అరీఫ్ అలీ ఖాన్ – ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డీఎస్బీ, జగిత్యాల
2. టి. సూర్య ప్రకాష్ – ఏఆర్ఎస్ఐ, డీఏఆర్, జగిత్యాల
3. మొహమ్మద్ అబ్దుల్ కలీమ్ – హెడ్ కానిస్టేబుల్-1953, మల్లాపూర్ పోలీస్ స్టేషన్
4. పీ. రాజయ్య – హెడ్ కానిస్టేబుల్-93, సారంగాపూర్ పోలీస్ స్టేషన్
5. ఆర్. నర్సింగ రావు – హెడ్ కానిస్టేబుల్-2143, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ (డీఎస్బీ అటాచ్మెంట్)
6. సీహెచ్. శేఖర్ – హెడ్ కానిస్టేబుల్-1696, మెట్పల్లి పోలీస్ స్టేషన్
7. ఆర్. శేఖర్ – హెడ్ కానిస్టేబుల్-21, డీసీఆర్బీ, జగిత్యాల
8. ఎ. శ్రీనివాస్ – ఏఆర్ హెడ్ కానిస్టేబుల్-2869, డీఏఆర్, జగిత్యాల
9. ఎం. కిరణ్ కుమార్ – పోలీస్ కానిస్టేబుల్-567, బీర్పూర్ పోలీస్ స్టేషన్ (సీఎంఎస్ అటాచ్మెంట్)
10. కె. జలపతి – పోలీస్ కానిస్టేబుల్-2076, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ (డీఎస్బీ అటాచ్మెంట్)
పథకాలకు ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలందించాలని ఆకాంక్షించారు.
రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
జగిత్యాల జిల్లా.
