DNN న్యూస్ – నందలూరు
నందలూరు: నందలూరు బార్ అసోసియేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ బాలాజీ మెడమల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కోర్టు మౌలిక సదుపాయాలు, న్యాయవాదులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించగా, జస్టిస్ బాలాజీ మెడమల్లి గారు సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ అలీ, సీనియర్ న్యాయవాది మరియు మాజీ బార్ అధ్యక్షులు నరసింహులు, వైస్ ప్రెసిడెంట్ జి. సుబ్బరామయ్య, జూనియర్ న్యాయవాది సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి సానుకూల స్పందనపై నందలూరు బార్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
– DNN న్యూస్, నందలూరు
