విద్యతోనే వికాసం… ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి
ప్రతిభావంతులైన విద్యార్థినులను సత్కరించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
DNN న్యూస్ | బర్రింకలపాడు, ఏలూరు | జూన్ 02, 2026
విద్యతోనే వ్యక్తి వికాసం సాధ్యమవుతుందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు.
మంగళవారం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టి. నర్సాపురం జెడ్పీ హైస్కూల్ ప్లస్‌లో పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థినులకు శాలువాలు, జ్ఞాపికలతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.25 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, “దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనండి, వాటిని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగండి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలి” అని పిలుపునిచ్చారు.
సత్కారం పొందిన విద్యార్థినులు
పదో తరగతి: తాడి లిఖిత సాయి
ఇంటర్ ప్రథమ సంవత్సరం: సయ్యద్ ఆరిశా, దూబా రమ్య
ఇంటర్ ద్వితీయ సంవత్సరం: కొక్కొండ రోషిత, పసుపులేటి హైమావతి
అనంతరం జెడ్పీ హైస్కూల్ ప్లస్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. తమ విద్యాభ్యాసానికి ఎమ్మెల్యే బాసటగా నిలవడం ఆనందంగా ఉందని విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ జట్ల సత్యనారాయణ, జనసేన యూత్ లీడర్ పింగుల మధు, ఉపాధ్యాయులు నానిపల్లి ఏసుబాబు, సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, కొరివి శేషారావు, జనసేన నాయకులు జె.డి. గంగాధర్ రావు, తోట సత్యనారాయణ, తోట రామకృష్ణ, దాసరి పుల్లారావు, విద్యార్థినుల తల్లిదండ్రులు సయ్యద్ అబ్దుల్లా, సూరిబాబు, సరోజినీ, దుర్గారావు, నాగలక్ష్మి, కుటుంబరావు, రాజారావు, బొట్టు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
